స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ బ్యూటీ మెహ్రీన్ మరోసారి నటించే అవకాశం అందుకుందని తాజా సమాచారం. మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ఎఫ్ 2’ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు జంటగా నటించింది. ప్రస్తుతం రూపొందుతున్న ‘ఎఫ్ 3’ మూవీలోనూ మెహ్రీన్ వరుణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ మూడు చిత్రాలకు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటికే రెండు భారీ హిట్స్ ఇచ్చిన ఆయన ‘ఎఫ్ 3’ రూపంలో మరో హిట్ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. దాదాపు ‘ఎఫ్ 2’ చిత్రబృందం ‘ఎఫ్ 3’కి కంటిన్యూ అవుతున్నారు.
ఈ సినిమాను 2022, ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయనున్నారు. కాగా, దీని తర్వాత అనిల్ రావిపూడి బాలకృష్ణ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా మెహ్రీన్‌కు ఛాన్స్ ఇచ్చారట. ఇదే నిజమైతే మెహ్రీన్ హీరోయిన్‌గా నాలుగో సారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో పనిచేస్తున్నట్టు. చూడాలి మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడనుందో.