గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,119 కరోనా కేసులు నమోదయ్యాయి. 10,264 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 396 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 1,09,940గా ఉన్నాయి. గడిచిన 539 రోజుల్లో యాక్టివ్ కేసులు తక్కువ నమోదవడం ఇదే తొలిసారి. నిన్న 1,11,481 యాక్టివ్ కేసులుండగా.. ఈ రోజు అది మరింత తగ్గింది.
