బాలీవుడ్ నటి.. ఎప్పుడు వివాదంలో ఉండే కంగన రనౌత్ పై మరోసారి కేసు నమోదైంది. రైతుల ఉద్యమాన్ని ‘ఖలీస్థానీ మూమెంట్’ తో పోలుస్తూ ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆమెపై ఫిర్యాదు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీసులు సెక్షన్ 295A(ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను అవమానించడం) కింద కంగనపై కేసు నమోదు చేశారు.