కరోనా నుంచి దేశానికి ఉపశమనం లభించినట్లేనని నిపుణులు అంటున్నారు. గత 3 వారాలుగా కొత్త కేసులు తగ్గాయి. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందనుకున్న పండుగల సీజన్ సేఫ్ గానే ముగిసింది.
98.32% రికవరీ రేటుతో.. జనాల్లో యాంటీబాడీలు పెరిగాయి. ఇక వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అందర్నీ భయపెట్టిన థర్డ్ వేవ్ వెళ్లిపోయిందని భావిస్తున్నారు. అయితే.. కొత్త వేరియంట్ ముప్పు, చలికాలం నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
మరోవైపు భారత్లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం కనిపించడం లేదని AIIMS డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. మనం భారీస్థాయిలో థర్డ్ వేవ్ చూసే అవకాశం చాలా తక్కువ. మనం ఇప్పటికే వ్యాక్సిన్లతో రక్షణ పొందాం. వ్యాక్సిన్ వేసుకోని వారు కూడా త్వరలోనే రెండు డోసులు వేసుకుంటారని భావిస్తున్నాను’ అని గులేరియా చెప్పారు.