స్వార్ధ రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణమని నారా రోహిత్ అన్నారు. ఆదివారం ఆయన నారా వారిపల్లెలో పూర్వీకుల సమాధుల దగ్గర.. నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదని, క్రమశిక్షణకు నందమూరి కుటుంబం మారుపేరని అన్నారు.
మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని నారా రోహిత్ అన్నారు.
పెద్దమ్మ భువనేశ్వరి సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదన్నారు. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసీపీ నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం మరోమారు ఇటువంటి దారుణానికి ఒడిగడితే సహించేది లేదని నారా రోహిత్ మరోసారి వైసీపీ నేతలను హెచ్చరించారు.