న్యూజిల్యాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్.. తన జెర్సీ ముందు భాగంలో టేప్ వేసుకొని వచ్చాడు. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయమంతా అతను అలాగే ఉన్నాడు. మిగతా జట్టు సభ్యులతో పోలిస్తే అతని జెర్సీ డిజైన్ కూడా వేరుగా ఉంది. అదేంటి? ఎందుకిలా ఉంది అని కొందరికి అనుమానం వచ్చింది కూడా.
కానీ టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని ఇట్టే పట్టేశారు. పంత్ ఈ ఇన్నింగ్స్లో టీ20 ప్రపంచకప్ జెర్సీ వేసుకొని వచ్చాడు. ఆ షర్టు కుడివైపు టీ20 వరల్డ్ కప్ లోగో ఉంది. దాన్ని కవర్ చేసేందుకే పంత్.. అలా టేపు వేసుకొని వచ్చాడన్నమాట.
జాగ్రత్తగా గమనిస్తే ఆ టీషర్టు ఎడమవైపు ఉన్న అశోక చక్రంపై కూడా ఒక నక్షత్రమే కనిపిస్తుంది. భారత్ గెలిచిన ఏకైక టీ20 ప్రపంచకప్ గుర్తుగా.. ఈ జెర్సీపై ఒక నక్షత్రమే ఉంటుంది. సాధారణ జెర్సీపై మాత్రం మూడు నక్షత్రాలు ఉంటాయి.