వరి ధాన్యం విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు దాటిపోయిందని, ఇక ఢిల్లీకి వెళ్లి స్పష్టత తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
ఆదివారం తనతోపాటు వ్యవసాయశాఖ మంత్రి నాయకత్వంలో మంత్రుల బృందం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారుల బృందం ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పా రు.
శనివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకటిరెండు రోజులు అక్కడే ఉండి, వీలైతే ప్రధానిని కలిసి స్పష్టత తీసుకుంటానన్నారు. రైతులకు స్పష్టత ఇవ్వకపోతే ఆగమైతరని, ఏపంట వేయాలో ఢిల్లీ నుంచి వచ్చాక చెప్తామన్నారు.