ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీకి చెందిన అభిమానులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కు జరిగిన అవమానం పట్ల సంయమనంతో వ్యవహరించాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఈ ప్రకటన చేసినట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని తెలిపారు.