తెలంగాణలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ఇందుకోసం ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్లపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ కోసం జోనల్ చట్టం తీసుకొచ్చామన్నారు. జోనల్ విధానం అమలు కారణంగా ఖాళీల భర్తీ కాస్త ఆలస్యమవుతోందని చెప్పారు.
‘‘ మేం చేయగలిగిందే చెబుతాం. కేంద్రం.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టింది. కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారన్న ప్రశ్న జోక్ ఆఫ్ ద మిలీనియం’’ అని చెప్పారు.