కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హితవు పలికారు. ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ”కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నరు.
ఇది మంచిదికాదు. నేను కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్న. చాలా హుందాగా ఉండాలె. కేసీఆరే బాధ్యుడని హుజూరాబాద్‌లో మాట్లాడిండు. అన్నీ అబద్ధాలే. నేను అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే, అప్పుడు నేను చేసిన పనికి ఇప్పుడు ధరలు పెంచుతున్నాం అంటున్నారు.
ఉన్నదా నీ దగ్గర లెక్క? చూపిస్తవా? వస్తవా? ప్రతి విషయాన్ని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, భ్రమలు కల్పించి అబద్ధాలు చెబుతున్నరు అని ఆయన అన్నారు.