ఇటీవల మృతి చెందిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం శాంతమ్మ దశదిన కర్మకు హాజరైన సీఎం.. మహబూబ్‌నగర్ భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని శాంతమ్మ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిచారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ అక్టోబర్ 29న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉంటున్న ఆమెకు గతనెల 29న రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటుతో కుప్పకూలారు.