పిఎస్‌వి గరుడవేగ’ సూపర్ హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్న చిత్ర యూనిట్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హోటల్ లో జరిగిన క్రిస్‌మస్ కేక్ మిక్సింగ్ ఈవెంటులో గరుడవేగ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో హీరోలు రాజశేఖర్, సునీల్, ఆదిత్, హీరోయిన్లు పూజా కుమార్, నందితా శ్వేత పాల్గొన్నారు.
రాజశేఖర్ గురించి సునీల్
కేక్ మిక్సింగ్ ఈవెంటులో సునీల్ మాట్లాడుతూ….. గరుడవేగ సినిమా సక్సెస్ అయినందుకు ముందుగా రాజశేఖర్ గారికి కంగ్రాట్స్. రాజశేఖర్ గారు నా ఫేవరెట్. హీరోగానే కాకుండా హ్యూమన్ బీయింగ్ గా కూడా నాకు చాలా ఇష్టం. రాజశేఖర్ గారు నాకు రియల్ లైఫ్ లో చాలా హెల్ప్ చేశారు. నా కూతురుకు వైద్యం చేసి కాపాడారు. ఈ క్రిస్ మస్ కు రాజఖర్ గారితో కలిసి కేక్ మిక్సింగ్ ఈవెంటులో ఉండటం చాలా ఆనందంగా ఉంది… అన్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ క్రిస్మస్ కేక్ అంటే చెన్నై లో ఎక్కువగా దొరుకుతుంది. హైదరాబాద్ లో ఇప్పుడిప్పుడే ఈ కల్చర్ వస్తోంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కేక్ అంటే స్పెషల్ గా తింటా. కానీ ఎలా తయారు చేస్తారో తెలీదు. ఈరోజు ఆ విషయం కూడా తెలుసుకున్నా. అందరికీ అడ్వాన్స్ గా హ్యీపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీవిత రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ’. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. సందర్భంగా జీవిత మాట్లాడుతూ మాకు ఎవరూ లేరా అనుకున్నాం…. చిరు, మహేష్, రాజమౌళి ఫోన్ చేశారని భావోద్వేగానికి గురయ్యారు.