తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ ..సమంత కమిటవబోయో కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేస్తుందా.! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. నాగ చైతన్యతో విడాకులు ప్రకటించిన తర్వాత తన కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది సమంత. పూర్తిగా నచ్చిన కథకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఆమె తెలుగులో ‘శాకుంతలం’, తమిళం మల్టీస్టారర్ మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమె దసరా రోజున రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ను కూడా అనౌన్స్ చేసింది. ఇందులో ఓ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో చేయనుండగా, మరో చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్‌లో చేయబోతోంది. మరోవైపు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తే ఓకే చెప్పడానికి రెడీగా ఉందట.
అయితే వరుస చిత్రాలను చేస్తూ మంచి ఫాంలో ఉన్న నాని..ఇటీవల ‘దసరా’ అనే మరో కొత్త మూవీని ప్రకటించాడు. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా కీర్తి సురేశ్ కన్‌ఫర్మ్ అయింది. మరో హీరోయిన్‌గా మేకర్స్ సమంత పేరును పరిశీలిస్తున్నారట. ఈ మూవీలో నటించేందుకు ఆమె 3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ ప్రస్తుతం మాత్రం ఇది బాగా హాట్ టాపిక్ అవుతోంది. ఇదే నిజమైతే సమంత రేంజ్ మరింతగా పెరిగిందనుకోవచ్చు. అంతేకాదు.. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలను చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న పూజా హెగ్డే, రష్మికల మందన్న కంటే కూడా సమంతకే ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పవచ్చు.