కోలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ శివ కార్తికేయన్. మీడియమ్ రేంజ్ బడ్జెట్ సినిమాలతో పెద్ద సక్సెస్ అందుకోవడం ఈ హీరో ప్రత్యేకత. ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. అందులో కొన్ని బాగానే పే చేశాయి. రీసెంట్ గా శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ మూవీ తమిళనాట బిగ్గెస్ట్ హిట్ అయింది. తెలుగులో ‘వరుణ్ డాక్టర్’ గా విడుదలై ఇక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ హీరో తెలుగులో ఓ డైరెక్ట్ సినిమా చేయాలని ఎప్పటినుంచో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ఖాయమైనట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
నారాయణ దాస్ నారంగ్ నిర్మాణంలో సినిమా రూపొందనుందని టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో డైరెక్ట్ సినిమాలకు రెడీ అవుతున్న దళపతి విజయ్, ధనుష్ బాటలోనే ఇప్పుడు శివ కార్తికేయన్ సైతం తెలుగు సినిమా చేయనుండడం విశేషంగా మారింది. ‘పిట్టగోడ, జాతిరత్నాలు’ చిత్రాలతో ప్రేక్షకులకి బోలెడంత వినోదం పంచిన అనుదీప్.. శివకార్తికేయన్ తో చేయబోయే సినిమాను కూడా అదే జానర్ లో తీయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లోని మూవీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.