ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన జగపతి బాబు ఇప్పుడు రూట్ మార్చి సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్‌గా మారిన జగపతి బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాడు. వీలున్నప్పుడు ప్రధాన పాత్రలలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలోని నటుణ్ణి తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు జగపతిబాబు.
ఇప్పుడు దక్షిణాదిన బిజీ హీరోయిన్ అయిన జగపతి బాబు హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటి నుండో ఆయనకు హిందీ ఆఫర్స్ వస్తున్నా కూడా కాస్త వెనకడుగు వేశాడు.
తాజాగా ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో జగపతిబాబు మెయిన్ విలన్ రోల్ పోషించనున్నారట. ఈ సినిమాకు ‘పుకార్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. అశుతోష్ గోవరికర్ దర్శకత్వం వహిస్తున్నారు. జావేద్ అక్తర్ కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. రానున్న రోజులలో జగపతి బాబు హిందీ సినిమాలతోను బిజీ కానున్నట్టు తెలుస్తుంది.