తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పలువురు జిల్లా పరిషత్ ల సిఇఓలు, డిప్యూటీ సీఇఓలు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు.
తమకు పదోన్నతులు కల్పించినందులకు మంత్రికి వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ సకాలంలో అందేవిధంగా పని చేయాలని మంత్రి ఈ సందర్భంగా వారిని ఆదేశించారు.
మంత్రిని కలిసిన వారిలో సిఇఓలు, డిప్యూటీ సీఇఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్ రావు, ఎంపీడీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సత్తయ్య, పలువురు సిఇఓలు, డిప్యూటీ సీఇఓలు ఉన్నారు.