తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
సీఎం కేసీఆర్ దార్శనికతతో విద్యుత్ సమస్యను అధిగమించాం అని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ విజయం సాధించామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.