వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రని సోమవారం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర తొలిరోజు విజయ వంతంగా ముగియగా మంగళవారం ఓ హాట్ టాపిక్‌కు సంబంధించిన చర్చలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి. అయితే ఆ టాపిక్ కారణం మాత్రం ఈనాడు ప్రచురించిన సంచలన కథనం.
అసలు విషయం ఏంటంటే మంగళవారం ఈనాడు మెయిన్ ఎడిషన్‌లో బాబు దిగిపోతే జాబు అనే కథనాన్ని ప్రచురించింది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చలు మొదలయ్యాయి. అంతే కాకుండా పాదయాత్రకి ముందు జగన్ రామోజీ రావుతో భేటీ అవడం.. తాజాగా ఈనాడులో ఎవరూ ఊహించని విధంగా బాబుకు వ్యతిరేకంగా కథనం రావడంతో.. ఈనాడు-సాక్షి గ్రూపుల మధ్య వైరిని పక్కన పెట్టేశాయని సర్వత్రా చర్చిచుకుంటున్నారు.
అయితే జగన్ పై ఈనాడు స్వరంలో మార్పు రావడానిక రాజకీయంగా అనేక కారణాలు ఉన్నా జగన్ సతీమణి ముఖ్య భూమిక పోషించారని తెలుస్తోంది. రామోజీరావు పెద్ద కొడుకు కిరణ్ సతీమణి శైలజా కిరణ్ కీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి పార్టీలకు కూడా వెలుతుంటారు.
ఇక వ్యాపార విషయంలో ఈనాడు- సాక్షి ఇంత పోటి పడిన కూడా వీరిద్దరి స్నేహం మధ్య వ్యాపార విషయంలో ఎలాంటి అడ్డంకులు రాలేవని చెప్తుంటారు. దీంతో రామోజీతో జగన్ భేటీ వెనుక భారతి సలహా ఉందని.. అదే ఇప్పుడు ఈనాడు స్వరంలో మార్పునకు కారణం అయ్యిందని.. దీంతో కొద్ది రోజుల నుండి కూడా ఈనాడు జగన్‌కు సపోర్ట్ గానే వుంటోంది. ఏది ఏమైనా ఈనాడు ప్రచురించిన ఒక కథనం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోందని రాజకీయ విశ్లేషకులకు సైతం చర్చించుకుంటున్నారు.