యువనటుడు అక్కినేని నాగచైతన్య ,అందాల రాక్షసి సాయిపల్లవి జంటగా నటించి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నా మూవీలో ఓ చెల్లి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు. ఆమె ఒప్పుకోకుంటే బాగుండు అనుకున్నా. ఆమె రిజెక్ట్ చేసిందని తెలియగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్‌తో డ్యాన్స్ వేయాలి అనుకుంటా గాని చెల్లెలిగా అంటే నాకే మనసు అంగీకరించలేదు’ అని చెప్పారు. తాను రీమేక్ సినిమాలు చేయనని ఎప్పుడో డిసైడయ్యానని సాయిపల్లవి చెప్పింది.