తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి నూతన ఉత్సాహం వచ్చింది అనటంలో ఎటువంటి సదేహం లేదు. మంత్రి గా భాద్యతలు స్వీకరించిన నాటి నుండి పార్టీకి విజయాలే తప్ప ఓటమి చవి చూడలేదు దానితో జోష్ లో పార్టీ కేడర్ ఇటీవల పార్టీ అధిష్ఠానం సంస్థాగత నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యూహచతురతకు, చిత్తశుద్దికి అసాధరణ విజయాలతో పార్టీలోని ప్రతి ఒక్కరికీ పార్టీ బలోపేతం చేయాలనే మరింత పట్టుదల వచ్చింది ఎందరో రాజకీయ ఉద్దండులను చూసిన ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ విలక్షణం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో యువకుడు..ఏం చేస్తాడులే అనుకున్న పరిస్థితి నుండి విమర్శకుల, ప్రత్యర్ధుల చేతే రాజకీయంగా రాటుదేలిన నేత, అజయ్ సామాన్యుడు కాదు.. అందరివాడు అనిపించుకోవడం అసామాన్యం. రాజకీయంగా ఒంటిచేత్తో కళ్లుచెదిరే విజయాలు సాధించి, తనను ఇరుకునపెట్టాలనుకున్న అస్మదీయుల, తస్మదీయుల ఊహకు అందకుండా రాజకీయ పరిణతిని సాధించిన పువ్వాడ ఖమ్మం జిల్లా అభివృద్దిపై బలమైన ముద్ర వేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే కాకుండా ఇతర మంత్రులు కూడా పువ్వాడ అజయ్ అభివృద్ది పట్ల చూపే చిత్తశుద్దిని, లక్ష్యసాధన కోసం చివరినిమిషం దాకా చేసే చేసే శ్రమను చూసి ముగ్దులవుతారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి, అంకితభావం, మేధస్సు ఎంతోమందికి రాని అవకాశాన్ని అందించింది. చాలామందికి పదవులొస్తాయి. కానీ వచ్చిన పదవులకు వన్నెతెచ్చేవారు అతిస్వల్పంగా ఉంటారు. సరైన నాయకుడు, పట్టుదల అంకిత భావంతో పనిచేసే నాయకుడు ఉండటంలో పార్టీ సంస్థాగత నిర్మాణం తో పాటు, పార్టీ మరింత బలోపేతం అయ్యి, ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి