తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కేసీఆర్ కలిశారు.
రీజినల్ రింగ్ రోడ్డును ఆమోదించినందుకు గడ్కరీకి సీఎం కృతజ్ఞతలు తెలపనున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు నిధులు కోరే అవకాశం ఉంది. నూతన జాతీయ రహదారుల నిర్మాణంపై విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే మంజూరైన హైవేలకు త్వరగా నెంబర్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. హైవేల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్వహణకు నిధులు కేటాయించాలని గడ్కరీని సీఎం కేసీఆర్ కోరే అవకాశం ఉంది.