దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,40,752 మంది వైరస్ వల్ల మరణించారు.
ఇక ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 43,903 మంది కోలుకోగా, 219 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 26,701 పాజిటివ్ కేసులు ఉన్నాయని, 74 మంది మరణించారని తెలిపింది.
కాగా, దేశవ్యాప్తంగా 68,75,41,762 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 వరకు 53,14,68,867 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకటించింది. ఇందులో ఆదివారం 14,10,649 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.