మూగమూడి అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయి ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది పూజా. ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాగా, ఈ మూవీ ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది.
ముకుంద సినిమాతో పూజాకి కొంత క్రేజ్ దక్కింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నపూజా ఆ తర్వాత వరుసగా,.. ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది.
పూజా నటించిన ఆచార్య, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోను నటిస్తుంది. హరీశ్ శంకర్ – పవన్ కల్యాణ్ కలయికలో వచ్చే సినిమాతో పాటు త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబోలో రానున్న ప్రాజెక్టులోనూ నటిస్తోంది.
సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న పూజా.. ఫొటో షూట్స్తోను కుర్రాళ్లకు క్రష్గామారి ఫాలోయింగ్ పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా కాలంగా సందడి చేస్తోన్న పూజా హెగ్డే.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలను సైతం షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే వీపు అందాలు చూపిస్తూ ఓ బ్లాక్ అండ్ వైట్ పిక్ షేర్ చేసింది. ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.