దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద సెప్టెంబర్ 2న తెరాస పార్టీ జాతీయ కార్యాలయ నిర్మాణ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో కలిసి పాల్గొనేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ముఖ్యమంత్రితో కలిసి బయలుదేరారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా జరిగే భూమి పూజా కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొననున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం కేంద్ర ప్రభుత్వం 1,300 గజాల స్థలాన్ని కేటాయించిన విషయం విదితమే.
ఈ స్థలంలో సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు.ఈ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి వార్డు, డివిజన్లో గులాబీ జెండాను ఎగురవేయలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు.