పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కాని, పవన్ బర్త్ డే వేడుకలు కాని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. రేపు పవన్ 50వ బర్త్ డే సందర్భంగా ఈ సారి అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా జరపాలని భావిస్తున్నారు.
ఒకవైపు పవన్ బర్త్ డే హంగామాతో పాటు మరోవైపు ఆయన పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలానే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్ రానున్నాయి. అలానే సెప్టెంబర్ 2, సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ట్విట్టర్ స్పేస్ నిర్వహించనున్నారు. ఇందులో దర్శకులు బాబీ, క్రిష్, బండ్ల గణేష్, హీరోయిన్ నిధి అగర్వాల్, ‘వకీల్ సాబ్’ నటి అనన్య నాగళ్ళ, నటుడు బ్రహ్మాజీ, నీలిమ, సంజనా గల్రాని, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, వరుణ్ సందేశ్, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అలాగే సాహిత్య రచయిత భాస్కర భట్ల పాల్గొననున్నారు.
వీరితో పాటు మరి కొందరు ప్రముఖులు కూడా ట్విట్టర్ స్పేస్‌లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. కాగా, ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెట్టారు. ఇప్పుడు సెట్స్ మీద ‘భీమ్లా నాయక్ , హరి హర వీరమల్లు చిత్రాలు ఉన్నాయి. అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బండ్ల గణేశ్ నిర్మాణంలో కూడా ఓ సినిమా చేస్తానని కమిటయ్యారు పవన్.