కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు.
ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్ నాయకులను హతమార్చాలని అమెరికన్ ఆర్మీని ఆదేశించారు.
‘కాబుల్ ఎయిర్పోర్టులో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులు హీరోలు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టం. వారిని క్షమించం. వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా పౌరులను తరలిస్తాం. మా మిషన్ కొనసాగుతుంది. కాబూల్ దాడి వెనక తాలిబన్లు, ఐసిస్ కుట్ర ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు’ అని జో బైడెన్ ప్రకటించారు.