దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 3.4శాతం పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజాగా 39,157 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 530 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,080 మంది బాధితులు కోలుకున్నారు.
150 మరో వైపు యాక్టివ్ కేసులు 150 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 3,63,605 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. జాతీయ రికవరీ రేటు 97.54 శాతానికి పెరిగిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని పేర్కొంది.
టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 57.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసింది. ఇప్పటి వరకు 50.26 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.