పాత అకౌంట్లో వేస్తే పాత బాకీల కింద పట్టుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి లక్ష కన్నా ఎక్కువ తీసుకోవద్దనే కేంద్రం పెట్టిన నిబంధన కూడా ఉన్నది. వాటన్నింటినీ అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకోవాలంటే మీరంతా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి.
కొత్తబ్యాంకు ఖాతాలోనే ఈ డబ్బులు వేసుకోవాలి. కలెక్టర్లు మీకు త్వరలోనే కొత్త ఖాతాలు తెరిపిస్తరు. దీనికి తెలంగాణ దళితబంధు ఖాతా అని పేరు పెట్టుకుంటం. ఆ ఖాతాలోనే డబ్బులు వేసుకొని స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టుకోవచ్చు.
మీకిచ్చే కార్డులో ఉండే ఎలక్ట్రానిక్ చిప్ ద్వారా మీరు ఏం పెట్టుబడి పెట్టారు.. ఏ పని ప్రారంభించారు.. ఎంత విజయవంతమైందనే విషయంపై ప్రభుత్వం, జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తరు అనిదళితబంధు పథకాన్ని సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం వేదికగా ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ క్లారిటీచ్చారు .