డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడుతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద జరుగుతున్న వ్యర్థాల తొలగింపు పనులను గురువారం మంత్రి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుత.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరీల్లో చెత్తా చెదారం పేరుకుపోయిందన్నారు.వ్యర్థాలను తొలగించి నూతనంగా మురికి కాలువలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ మరుగొండ రాము, విప్ నెరేళ్ల వేణు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.