ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వారికి భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.
వనపర్తిలోని తన నివాసంలో బుధవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారు పాల్గొన్నారు.