హుజూరాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్‌కోటాలో ఇటీవల ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారుచేస్తూ ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది.
ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఆమోదం కోసం సంబంధిత ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపాక కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి గతనెల 21న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘కౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నది. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గానికో, కరీంనగర్ జిల్లాకో పరిమితం కాడు. నేను ఆయన భవిష్యత్తుకు మార్గం ఏర్పాటు చేస్తా’ అని హామీఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. కౌశిక్‌రెడ్డికి నామినేటెడ్ ఎమ్మెల్సీ ప్రకటించడంపై హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు సంబురంలో మునిగిపోయాయి.