మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలా హాబీ టేషన్లలలో క్షేత్రస్థాయిలో సమస్యల వల్ల మిషన్ భగీరథ నీరు చేర లేదన్నారు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు.అన్ని హ్యాబిటేషన్లలో ప్రతి ఇంటికి నీరు చేరేలా చూడాలన్నారు.
కొత్తపల్లి హెచ్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టాలని, నగునూర్, బొమ్మకల్, తీగల గుట్టపల్లి గ్రామాల్లో నీటి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలన్నారు.ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. మిషన్ భగీరథ సమస్యలను పరిష్కరించాలన్నారు. దీనికోసం 40 నుండి 50 బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 15 రోజుల్లో సమస్యలను పూర్తి చేయాలన్నారు.
మిషన్ భగీరథ నీరు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు కూడా నీటి సరఫరా చేయాలన్నారు. అధికారులు కష్టపడి పనిచేసి ఫలితం సాధించాలన్నారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో పనిచేయాలన్నారు. నీటి సరఫరా చేసే పైప్లైన్ డ్యామేజ్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వల్లూరి క్రాంతి, మిషన్ భగీరథ ఈ ఎన్ సి కృపాకర్ రెడ్డి, సీఈ శ్రీనివాసరావు, ఏస్ఈ, డీఈలు తదితరులు పాల్గొన్నారు.