కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ని కలిసేందుకు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులకు తన నివాసం వద్ద ఉన్న కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నారు.