Home / SLIDER / పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతి పైమంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షా

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతి పైమంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతి పై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో డిజిపి మహేందర్ రెడ్డి,హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్,ఆర్ అండ్ బి అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రెండు నెలల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీని,ఆర్ అండ్ బి అధికారులను మంత్రి ఆదేశించారు.పోలీస్ కమాండ్ సెంటర్ 14వ అంతస్థు నుంచి హైదరాబాద్ నగర నలువైపులా ఉన్న ముఖ్య ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ కోట, కేబీఆర్ పార్క్,హుస్సేన్ సాగర్ చూపరులకు ఆకర్షణీయంగా,ఆహ్లాదకరంగా కన్పిస్తాయన్నారు.రానున్న రోజుల్లో సంవత్సరం పొడవునా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

పారిస్ లో ఈఫిల్ టవర్, దుబాయ్ లో బూర్జు ఖలీఫా మీద నుంచి ఆయా నగరాలను ఏ విధంగా సందర్శకులు వీక్షిస్తారో…అదేవిధంగా తెలంగాణ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 14వ అంతస్థు నుండి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించవచ్చన్నారు.హైదరాబాద్ నగర అందంగా,చూడచక్కగా ఈ ప్రదేశం కన్పిస్తుందని మంత్రి చెప్పారు.

సందర్శనార్థం వచ్చే వారికి…ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పే వివరాలు,ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు,తెలంగాణ పోలీస్ శాఖ,కమాండ్ కంట్రోల్ సెంటర్ వివరాలు అందులోనే నిర్మించే మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.ప్రముఖ మ్యూజియం నిర్మాణ నిపుణులు వసీంఖాన్ వారి భాగస్వాములు ఆధ్వర్యంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.ఈ సమీక్షా సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి,సి.పి అంజనికుమార్,ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి,వర్క్ ఏజన్సీ ప్రతినిధి లక్ష్మణ్,మ్యూజియం నిర్మాణ నిపుణులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat