గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగటం మంచిది. మరీ చల్లగా ఉండే నీరు ఒంట్లోంచి ద్రవాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది.
రోజును నీటితో ఆరంభించటం మంచిది. ఉదయం ఓ గ్లాసు నీరు తాగితే ఉత్సాహం వస్తుంది.
భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగకూడదు.
దీని వల్ల జీర్ణరసాలు పల్చగా అయి జీర్ణక్రియ మందగిస్తుంది.
టీ, కాఫీలు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. వీటిని తీసుకునేటప్పుడు కాస్త నీళ్లు తాగాలి.