దేశ రాజకీయాల్లో దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ గారిని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు అన్నారు, PMGSY, జీవవైవిధ్య కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు చిట్యాల మండలంలోని నేరడ-ఎలికట్టె గ్రామ సరిహద్దుల్లో రోడ్డుకు ఇరువైపులా ఆయన మొక్కలు నాటారు, ఈ సందర్భంగా ఆయన ఇరు గ్రామాల ప్రజలతో కలిసి మొక్కలు నాటారు.
తొలుత నేరడ గ్రామంలోని ఎస్సి కాలనీ మహిళలతో ఆయన మాట్లాడారు, ఎస్సి కాలనీలో పేరుకుపోయిన అన్ని సమస్యలను త్వరత్వరగతిన పూర్తి చేస్తామని తెలిపారు, కాలనిలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజి వ్యవస్థకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు,గతంలో ఏ ప్రభుత్వాలు, ఏ ముఖ్యమంత్రులు చేయని సాహసోపేతమైన నిర్ణయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు, ప్రతి మండలంలో లక్ష మొక్కలను నాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.ప్రత్యేక దృష్టితో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు, గ్రామాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను దశలవారిగా సమకూర్చుతామని అన్నారు..