కల్లెడ నుండి లక్ష్మీపూర్ వయా గుట్రాజ్ పల్లి వరకు 2.72 కోట్లతో ఏర్పాటు చేసిన బిటి రోడ్డు మరియు 4 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు అనంతరం టీ-సెర్ఫ్ 2020-21ఆర్ధిక సంవత్సరంలో 118 స్వశక్తి సంఘాలకు మంజూరైన చెక్కులను మహిళ సంఘాలకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ రవి,గ్రంధాలయ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, ఎంపీపీ రాజు, ప్యాక్స్ చైర్మన్ లు సందీప్ రావు, మహిపల్ రెడ్డి amc చైర్మన్ దామోదర్ రావు,రైతు సమన్వయ సమితి జిల్లా మెంబెర్ బాల ముకుందాం,సర్పంచ్ మహేశ్వర్ రావు, విజయ్ లక్ష్మీ ,జాన్ ,ఎంపీటీసీ పరుశురాం గౌడ్, నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.