సిరిసిల్లలో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు..
? కెసిఆర్ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు
? గొర్రెల పంపిణీ కి ఎనిమిది వేల కోట్లు.. ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం
? ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లు బతికి ఉన్నప్పుడే తెలంగాణ రాకముందు మిషన్ భగీరథ పథకం పై చర్చించాం
? సన్యాసులకు ఎప్పుడు అనుమానాలు ఉంటాయి
? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు
? ప్రపంచంలోనే కాళేశ్వరం అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తెలుగు మీడియా ప్రసారం చేయకున్నా ఇంగ్లీష్ మీడియా “లిఫ్ట్ ఏ రివర్” పేరిట ప్రసారం చేసింది
? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎన్ని వేల కోట్లు కరెంట్ బిల్లు కడతారని సన్యాసులు ప్రశ్నిస్తున్నారని 10 వేల కోట్లు అయినా కట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు
? గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం తో పాటు రైతుల ఇంట్లో బంగారు వర్షం కురిపించేందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తాం
? కరీంనగర్ ను సజీవ జలధార గా మార్చామ్
? అప్పర్ మానేరు మే నెలలో నిండుతుందా అని ఎవరైనా అనుకున్నారా
? అప్పర్ మానేరు నుండి గోదావరి వరకు వందలాది చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నాం
? రెండవ జలధార వరద కాలువ
? వరద కాలువ రిజర్వాయర్ గా మారుతుంది అని ఎవరూ అనుకోలేదు
? వరద కాలువ తో 110 కిలోమీటర్ల దూరం సజీవ జలధార గా ఉంది
? రామగుండం దగ్గర చిన్న దార కోసం వెతుక్కునే పరిస్థితి ఉండేది
? 180 కిలోమీటర్ల మేర గోదావరి సజీవంగా మారింది
? 365 రోజులు నీటితో కళకళలాడుతుంది
? తెలంగాణలో 30 లక్షల కరెంట్ మోటర్ లు ఉన్నాయి
? ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలి పోయే పరిస్థితి లేకుండా చేసాం
? 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాము
? మహబూబ్ నగర్ లో 10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేశాం
? పాలమూరు పూర్తయితే మరో పది లక్షల ఎకరాలకు నీరు
? ఇల్లంతకుంట లో చాలామంది దోస్తులు ఉన్నారు చిన్నతనంలో వెళ్తే కరువుతో దుఖం వచ్చేది.. ఇప్పుడు కావాల్సినన్ని నీళ్ళున్నాయి
? మిషన్ భగీరథ తో మంచినీళ్ళ గోస పోయింది
? 11 రాష్ట్రాల నుండి బృందాలు వచ్చి మిషన్ భగీరథ ను చూసి వెళ్లారు
? సమైక్య రాష్ట్రంలో చేనేత కార్మికులు రోజు ఆత్మహత్యలు చేసుకునే వారు
? బతుకమ్మ చీరలతో నేతన్నలకు భరోసా ఇచ్చామ్
? నిరు పేదలకు చీరలు ఇవ్వడంతోపాటు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపామ్
? రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ రైతు భీమా వలె నేతన్నల బీమా గా త్వరలో ప్రకటిస్తాం
? నేతన్న చనిపోతే ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి అందిస్తాము
? చిరునవ్వుల తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నాం
? సిరిసిల్లలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 కోట్లు మంజూరు
? కరోనా మహమ్మారి అందరినీ పరేశాన్ చేసింది
? వైరస్ అనేక రూపాల్లో మనుషులపై దాడి చేస్తోంది
? మెడికల్ కాలేజీ అంటే చదువు చెప్పే కళాశాల మాత్రమే కాదు 600 పడకల ఆసుపత్రి
? సిరిసిల్ల కూడా మెడికల్ కాలేజీ వచ్చే ఏడాది ఇస్తాం
? ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం
? ఆశ వర్కర్లు, ఎఎన్ఎంలు, నర్సులు, వైద్యులకు సెల్యూట్ చేస్తున్నా
? విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించారు
? ద్వారా సర్వే చేసి ఇంటి దగ్గర మెడికల్ కిట్లు అందించడం ద్వారా ఎందరో కరోనా నుండి కోరుకున్నారు
? 13 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేసుకున్నం
? నర్సింగ్ శిక్షణ తీసుకునే విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయించాం
1500 నుండి మొదటి సంవత్సరం 5000 రెండో సంవత్సరం 6,000 మూడవ సంవత్సరం ఏడు వేల రూపాయలకు పెంచుతాం
? సిరిసిల్లకు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తమ్
? ఇల్లంతకుంట లో రెండు వందల నలభై ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది 40 ఎకరాల ఐల్యాండు ఉంది దాన్ని టూరిజం సర్క్యూట్ గా మారుస్తాం
? రాజన్న దేవాలయం దక్షిణ కాశీగా పేరు పొందింది
? రాజన్న దేవాలయం అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తా
? యాదవులను, మత్స్యకారులను వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఆదుకున్నం
? దళిత జాతి అభివృద్ధి కోసం రాబోయే నాలుగేళ్లలో
45 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం
? ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తాము
? దళిత బిడ్డలు కాలర్ ఎగరేసుకుని బతికే విధంగా చేస్తాం
? వచ్చే నెల నుండి 57 సంవత్సరాలు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు అందిస్తాం
? రాజన్న ప్రజల దేవుడు
? అప్పర్ మానేరు ప్రాజెక్టు కు 50 కోట్లు మంజూరు..
పాత ఆయకట్టును పునరుద్ధరించాలి
? ఆక్సిజన్ కొనుక్కోవడం చూస్తే సిగ్గనిపిస్తోంది
? హరితహారం లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
? యావత్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 12769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఉన్నాయి
? అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు నిర్మించాం
? ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్లు హరితహారం విజయవంతానికి కృషి చేయాలి
? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని అకుంఠిత దీక్షతో చేయాలి
? మండల పరిషత్, జిల్లా పరిషత్తు లకు సైతం నిధులు ఇస్తున్నాం
? సిరిసిల్ల సిరుల జిల్లాగా మారింది
? ఈ నెల 10 తర్వాత రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ