వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం కల్పిస్తోంది. పీఎం కిసాన్ FPO యోజన పథకం ద్వారా రైతులు అగ్రికల్చర్ బిజినెస్ ప్రారంభించడానికి కేంద్రం రూ. 15లక్షలు అందించనుంది.
ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవడానికి 11 మంది రైతులు ఒక సంస్థను ఏర్పాటు చేసి.. దానిని కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. త్వరలోనే ఈ పథకం రిజిస్ట్రేషన్, విధివిధానాలను కేంద్రం ప్రకటించనుంది.