బొప్పాయి ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణకు ఔషధంలా పనిచేస్తుంది. చర్మం పొడిబారకుండా బొప్పాయి ఫేస్‌ప్యాక్ వేసుకోండి. బొప్పాయి గుజ్జులో అరటిపండు గుజ్జు, తేనే కలిపి మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.
ఓ అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కోండి. ఇలా చేయడం వల్ల బొప్పాయిలోని ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని సాగకుండా కాపాడి.. కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.