తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి 5 కిలోలే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికీ ఉచితంగా 5 కిలోలు బియ్యం కేంద్రం ఇస్తామనగా, రాష్ట్ర సర్కారు 5 కిలోలు ఇస్తామంది. 3 నెలలు కలిపి మనిషికి 30 కిలోలు ఇవ్వాల్సి ఉండగా, 25 కేజీలే అందాయి. ఈ క్రమంలో తాజా ఉత్తర్వులు గందరగోళం సృష్టిస్తున్నాయి.