Home / SLIDER / దళితులకు నాడు దగా.. నేడు ధీమా

దళితులకు నాడు దగా.. నేడు ధీమా

ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు దళితులను రాజకీయంగా, ఓటు బ్యాంకుగా చూశారే తప్ప.. వారిని సాటి మనుషులుగా చూసిన సందర్భం లేదు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా దళితులకు అన్యాయమే జరిగింది. నాడు ఇక్కట్లు పడిన దళితులు స్వరాష్ట్రంలో సగర్వంగా, ఆర్థిక స్వావలంబనతో సాధికారత సాధించేలా కృషిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పించారు. ఇందుకోసం ఏది చేయడానికైనా, ఎంత ఖర్చు చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారు. గత ఏడేండ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం చేసిన కృషిని ఒకసారి పరికిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన దళిత సమాజం.. ఇవాళ స్వరాష్ట్రంలో సగర్వంగా, ధీమాతో జీవిస్తున్నది. ఆర్థిక పరిపుష్టం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది.

ఏడేండ్లలో 55 వేల కోట్లు
సీఎం కేసీఆర్‌.. ఎంతో మేథోమథనం చేసి దళితుల అభివృద్ధి కోసం దేశంలోనే తొలిసారిగా ‘ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌’ను తీసుకొచ్చారు. ఈ ఫండ్‌ కింద ఒక ఏడాదిలో కేటాయించిన నిధులు ఖర్చుకాని పక్షంలో.. వాటిని మరుసటి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్‌ చేసే వెసులుబాటును కల్పించారు. గతంలో అమల్లోఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించే నిధులను రెట్టింపుచేశారు. వెరసి గత ఏడేండ్లలో దళితులకోసం ఏకంగా రూ.55,438.89 కోట్లు ఖర్చుచేశారు. ఉమ్మడిరాష్ట్ర పాలకులు చివరి పదేండ్లలో దళితుల కోసం ఖర్చు చేసింది ఏడాదికి రూ.వెయ్యికోట్ల చొప్పున రూ.పది వేల కోట్లు మాత్రమే. నాడు పదేండ్లలో ఖర్చుచేసిన నిధులను సీఎం కేసీఆర్‌ ఏడాది కాలంలోనే దళితుల కోసం ఖర్చుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 2017-18లో రూ.9,990 కోట్లు, 2018-19లో రూ.10,989 కోట్లు, 2019-20లో రూ.10,744 కోట్లు, 2020-21లో రూ.10,838 కోట్లు దళితుల అభివృద్ధి కోసం ఖర్చుచేసింది.

6,874 మందికి భూమి భరోసా
నాడు దగా.. నేడు ధీమాఎవుసం చేస్తారు.. కానీ వారికి గుంట భూమి ఉండదు. కాయకష్టం చేస్తారు.. కానీ ఏకాన ఆదాయం ఉండదు. ఇదీ ఉమ్మడిరాష్ట్రంలో దళితుల పరిస్థితి. స్వరాష్ట్రంలో దళితులకు భూమి ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఒక్కొక్కరికి మూడెకరాల చొప్పున పంపిణీ చేసింది. తద్వారా ఆర్థికస్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకొన్నది. 2014-15 నుంచి ఇప్పటివరకు 6,874 మంది లబ్ధిదారులకు ఏకంగా 16.906 ఎకరాలను పంపిణీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.755.94 కోట్లు వెచ్చించింది. 1983లో దళితులకు భూ పంపిణీ పథకం ప్రారంభమైనా దాని అమలులో పాలకులు చిత్తశుద్ధి చూపలేదు. నాటినుంచి రాష్ట్రం విడిపోయేనాటికి 30 ఏండ్లలో ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో దళితులకు పంపిణీ చేసిన భూమి 30 వేల ఎకరాలు మాత్రమే. ఖర్చుచేసింది రూ.73.65 కోట్లు మాత్రమే.

దళిత మహిళలకు మూడెకరాల భూమి

నాడు దగా.. నేడు ధీమా
స్వయం ఉపాధికి భరోసా..
నాడు దగా.. నేడు ధీమాదళిత బిడ్డలు స్వయం సమృద్ధి సాధించేలా సీఎం కేసీఆర్‌ వివిధ పథకాల ద్వారా సబ్సిడీ రుణాలు అందించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను అమలుచేస్తున్నది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ. 37.44 కోట్లు ఖర్చు చేసి 8974 మందికి శిక్షణ ఇచ్చింది. అదే విధంగా డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం ద్వారా కారు డ్రైవర్లను.. ఓనర్లను చేసింది. ఈ పథకం ద్వారా రూ. 96.16 కోట్లు ఖర్చుచేసి 2,105 వాహనాలను ఎస్సీ యువతకు ఇప్పించింది. అలాగే దళిత యువతకు వివిధరంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌ బోరబండలోని ఇందిరానగర్‌లో 9 అంతస్తులతో ఆధునిక విజ్ఞానకేంద్రాన్ని నిర్మిస్తున్నది. దేశంలో ఎక్కడాలేనివిధంగా ఇక్కడ అతిపెద్ద మ్యూజియంతోపాటు సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. ఈ భవనంలో 26 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఈ భవనం కోసం 1,550 చదరపు అడుగుల స్థలాన్ని 2016లో ప్రభుత్వం కేటాయించింది. రూ.21 కోట్లు మంజూరు చేసింది.

1,82,911 మందికి కల్యాణలక్ష్మి
నాడు దగా.. నేడు ధీమాఎస్సీ కుటుంబాల్లో ఆడబిడ్డ పెండ్లి తాహతుకు మించిన భారం. తల్లిదండ్రులకు పెద్ద రంది. ఎస్సీ కుటుంబాల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా.. ఏ అయ్య చేతిల్నో పెట్టి బరువు దించుకొనే పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో గొప్పగా పాలనచేశామని చెప్పుకొనేవారికి పేదింటి దళిత ఆడపిల్ల పెళ్లిగోస కనిపించలేదు. స్వరాష్ట్రంలో పేదింటి ఆడపిల్ల పెండ్లిగోస తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ వినూత్నంగా కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఈ పథకం దళితుల ఇండ్లలో కల్యాణ కాంతులు తీసుకొచ్చింది. ప్రభుత్వం అందించే రూ. 1,00,116తో పెండ్లిచేసి ఆడబిడ్డను సంతోషంగా అత్తారింటికి పంపుతున్నారు. ఇప్పటివరకు 1,82,911 దళిత కుటుంబాలకు రూ.1422 కోట్ల కల్యాణ లక్ష్మి సాయం అందింది.

కల్యాణలక్ష్మి కింద లబ్ధిపొందిన ఎస్సీ మహిళా కుటుంబాలు
నాడు దగా.. నేడు ధీమా
స్వరాష్ట్రంలో వివిధ పథకాలతో దళితులు పొందిన లబ్ధి
నాడు దగా.. నేడు ధీమా
రాజ్యాంగ నిర్మాతకు ఆకాశమంత గౌరవం
నాడు దగా.. నేడు ధీమారాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహం నిర్మాణానికి ప్రభుత్వం పూనుకున్నది. దేశంలోనే మరెక్కడాలేనివిధంగా 11.4 ఎకరాల్లో పార్లమెంట్‌ ఆవరణలోని విగ్రహాన్ని పోలిన 50 అడుగుల విగ్రహం, 125 అడుగుల ఎత్తు (పీఠంతో కలిపి 175 అడుగులు)తో, 45.5 అడుగుల వెడల్పుతో ఈ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఇందుకోసం 791 టన్నుల స్టీలు, 96 మెట్రిక్‌ టన్నుల ఇత్తడి వినియోగిస్తున్నారు. రూ.146.50 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మిస్తున్నది.

16.36 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు
నాడు దగా.. నేడు ధీమాఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కాలనీలకు విద్యుత్తు కనెక్షనే ఉండేది కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దళితవాడలకు విద్యుత్తును సరఫరా చేసింది. దీనికితోడు వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌.. 50 యూనిట్ల వినియోగం వరకు ఉచిత విద్యుత్తును ప్రకటించారు. దీంతో 16.36 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.248 కోట్లు ఖర్చు
చేస్తుండటం గమనార్హం.

ఎస్సీల గృహాలకు ఉచిత కరెంటు
నాడు దగా.. నేడు ధీమా
620 మందికి విదేశీ విద్య
నాడు దగా.. నేడు ధీమాఇంట్లో విద్యావంతుడు ఉంటే ఆ కుటుంబం భవిష్యత్‌తరాల జీవితాలూ పూర్తిగా మారిపోతాయి. కానీ, ప్రభుత్వ పాఠశాల్లో చదివేందుకే వెనుకంజ వేసే ఎస్సీలకు.. ఉన్నతవిద్య అరుదే. అందులోనూ విదేశీవిద్య అందని ద్రాక్షనే. అలాంటి కలను సీఎం కేసీఆర్‌ సాకారం చేశారు. బీఆర్‌ అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ద్వారా దళితులకు విదేశీవిద్య కోసం ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల స్కాలర్‌షిప్‌ అందిస్తున్నారు. దీంతో దళిత విద్యార్థులు ఏకంగా విమానమెక్కి విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే అవకాశం దక్కింది. అమెరికా, ఇంగ్లండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాల్లో తెలంగాణ దళితబిడ్డలు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఇందుకోసం ఏడేండ్లలో రూ.107.54 కోట్లు ఖర్చుచేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విద్యానిధి పథకం
నాడు దగా.. నేడు ధీమా
స్వరాష్ట్రంలో ఎస్సీ స్పెషల్‌
నాడు దగా.. నేడు ధీమా
వివక్షపై పోరాటం
ఉమ్మడి ఏపీలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా ఉండేవి. వాటిపై ఫిర్యాదుచేసినా పట్టించుకొనేవారు కాదు. స్వరాష్ట్రంలో దళితులకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నది. వారిపై వివక్షను పూర్తిగా నిర్మూలించే చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ద్వారా ప్రభుత్వం వారికి రక్షణ కల్పిస్తున్నది. స్వరాష్ట్రంలో ఇప్పటివరకు 8,818 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసింది. ఇందులో ఎస్సీ అట్రాసిటీ కేసులే 6,106 ఉన్నాయి. ప్రభుత్వం వారికి రూ.81.46 కోట్ల పరిహారం అందజేసింది. దళితులపై వివక్షను తొలగించేందుకు, కులం అడ్డుగోడలను కూల్చేందుకు కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగానే దళిత అమ్మాయినో లేదా అబ్బాయినో పెండ్లి చేసుకొంటే ఆ జంటకు రూ.2.50 లక్షల ప్రోత్సాహం అందిస్తున్నది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 5,337 మంది లబ్ధిదారులకు రూ.43.25 కోట్ల ప్రోత్సాహం అందించింది.

నాడు దగా.. నేడు ధీమాస్టడీ సర్కిళ్లతో 1,181 మందికి ఉద్యోగం
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే దళిత విద్యార్థులకు ప్రభుత్వం ఉన్నతమైన శిక్షణను అందిస్తున్నది. ఇందుకోసం ఎస్సీ స్టడీ సర్కిల్స్‌కు పునర్జీవం పోసింది. కొత్త జిల్లాల్లో నూతన స్టడీసర్కిళ్లను ప్రారంభించింది. ఆయా జిల్లాల్లోనే ఎస్సీ విద్యార్థులకు పోటీపరీక్షల కోసం నాణ్యమైన శిక్షణను ఇప్పిస్తున్నది. దీనిఫలితంగానే ఇప్పటివరకు 1,181 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో 12 మంది విద్యార్థులు అఖిల భారత సర్వీస్‌(సివిల్స్‌)కు ఎంపిక కావడం విశేషం.

268 గురుకులాలు
నాడు దగా.. నేడు ధీమాస్వరాష్ట్రంలో నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ సాంఘిక సంక్షేమ గురుకులాలను ఏర్పాటుచేశారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 134 గురుకులాలు మాత్రమే ఉండగా.. ఒక్క ఏడాదిలోనే వాటిసంఖ్యను 268కి పెంచారు. అంతేకాకుండా వాటిని కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. ఆర్థికంగా శక్తి ఉన్నవారు సైతం తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లోనే చదివించాలనేలా తయారుచేశారు. విద్యార్థులకు గతానికి భిన్నంగా సన్నబియ్యంతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ఎస్సీ గురుకులాల్లోనే సుమారు 8 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, మెస్‌చార్జీలను పెంచారు. 8-10వ తరగతి విద్యార్థులకు ఇచ్చే మెస్‌చార్జీలను రూ. 850 నుంచి రూ.1,100 పెరిగింది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ.1,500 ఇస్తున్నారు. స్కాలర్‌షిప్‌లు 70-80 శాతం పెరిగాయి. పభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకొనే ఎస్సీ విద్యార్థులకు వసతి కల్పించేందుకు ప్రభుత్వం 873 హాస్టళ్లను నిర్వహిస్తున్నది. వీటిలో సుమారు 74 వేల మందికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నది. ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యనందించేందుకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం ద్వారా ఏటా వందల మందికి కార్పొరేట్‌ స్కూళ్లలో ప్రవేశం కల్పిస్తున్నది. ఈ పథకం కింద విద్యార్థికి అందించే గ్రాంట్‌ను రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు రూ.4,448.74 కోట్లు ఖర్చుచేశారు.

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈ సంస్థలు
మొత్తం విద్యాసంస్థలు- 268
ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు- 238 (బాలికలు- 173; బాలురు 93; కో ఎడ్యుకేషన్‌- 2)
మహిళల డిగ్రీ కాలేజీలు- 30
మొత్తం విద్యార్థులు (సంఖ్య)- 1,55,320 (బాలురు 53,300, బాలికలు 1,02,020)
ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థులు(సంఖ్య)- 1,36,122 (బాలురు 53,300, బాలికలు- 82,822)
మహిళా డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు (సంఖ్య)- 19,198

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat