తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించిందని, అదేవిధంగా ఆలయాల్లో పూజలు, అలంకరణ కోసం ప్రత్యేకంగా రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు.
సీఎం ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిరహించేందుకు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 3లక్షల మందికి సరిపడా మాస్క్‌లు, శానిటైజర్లు వ్యక్తిగతంగా తాను అందజేయనున్నట్లు తలసాని ప్రకటించారు.
గోల్కొండ బోనాల ఉత్సవాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మను మంత్రి కోరారు. బోనాల సందర్భంగా 189 ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలను సమర్పించనున్నట్లు తెలిపారు.