తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని వెంగళ్రావు నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సెంటర్ ప్రారంభోత్సవం కంటే ముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. శాంతి కోసం ఎంత శ్రమిస్తే.. యుద్ధంలో అంత తక్కువ రక్తాన్ని చిందిస్తాము అని కేటీఆర్ తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. ఈ కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా కరోనా థర్డ్ వేవ్‌ను, కరోనా ఇతర సమస్యలను పూర్తిగా అరికట్టే అవకాశం ఉందన్నారు.