Home / NATIONAL / రైల్వే భూములకు కేంద్రం టెండర్‌

రైల్వే భూములకు కేంద్రం టెండర్‌

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్‌
త్వరలో చిలుకలగూడలో 18 ఎకరాలకు కూడా.ఇప్పటికే ఎన్నో భారీ ప్రభుత్వ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన మోదీ ప్రభుత్వం.. పేదోడి జీవనాడి అయిన రైల్వేను ప్రైవేటుపరం చేసేందుకు రైలంత వేగంతో పరుగెడుతున్నది. అధిక లాభాలార్జిస్తున్న అనేక మార్గాల్లో ప్రైవేటుకు తలుపులు తెరిచిన కేంద్రం, తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ఆస్తులను లీజు పేరుతో ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నది. ఇప్పటికే 13 రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టింది. మన రాష్ట్రంలో కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విలువైన భూములను దీర్ఘకాలంపాటు లీజుపేరుతో కరిగించేస్తున్నది. ప్రజా సంక్షేమం కోసం నిరుపయోగంగా ఉన్న భూములను రాష్ట్రప్రభుత్వం అమ్మాలని ప్రయత్నిస్తే నానా యాగీ చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్వాకంపై మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం.

దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన సికింద్రాబాద్‌ పరిధిలోని భూముల లీజు ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది. మౌలాలి ప్రాంతంలోని 21.51 ఎకరాల స్థలాన్ని ప్రైవేటుకు లీజుకు ఇవ్వడానికి రైల్వే అధికారులు నోటిఫికేషన్‌ జారీచేశారు. టెండర్‌ దాఖలుకు ఆగస్టు 18 వరకు గడువు ఇచ్చారు. కమర్షియల్‌ కోసం కనీసం 45 ఏండ్లు, రెసిడెన్షియల్‌ కోసం 99 ఏండ్లకు లీజుకు ఇస్తున్నారు. చిలకలగూడ ప్రాంతంలో 18ఎకరాల స్థలాన్ని ప్రైవేటుకు లీజుకు ఇవ్వడానికి టెండర్లు పిలువబోతున్నారు. రైల్వేనిలయం ఎదురుగా ఉన్న మూడెకరాల రైల్వే స్థలాన్ని, మెట్టుగూడలోని రైల్వే క్వార్టర్స్‌ను కూడా లీజు పేరిట ప్రైవేటుకు ఇచ్చేందుకు నిర్ణయించారు. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ తదితర పెద్దస్టేషన్ల పరిధిలోని స్థలాలపైనా అన్వేషణ సాగుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కూడా ఇదేరీతిన స్థలాల లీజుకు సర్వే మొదలైంది.

కిక్కురుమనని టీ-బీజేపీ
కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్వాకంపై తెలంగాణ బీజేపీ నేతలు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. తెలంగాణపైనా ఆ ప్రభావం పడింది. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ ఆధీనంలోని నిరుపయోగ భూములను విక్రయించాలని నిర్ణయించి, అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఉమ్మడి ఏపీలోనూ తెలంగాణలోని విలువైన భూములను వేలంవేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకోసం భూములను విక్రయించేందుకు యత్నిస్తుంటే అవాకులు చెవాకులు పేలుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. కేంద్రం చేస్తున్న పనిపై ఏం సమాధా నం చెప్తారన్న ప్రశ్నలు వెలువడుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat