తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మంత్రివర్గం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు..
ఈ భేటీలో లాక్డౌన్,వర్శపాతం,సాగు,కరోనా పరిస్థితులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపటితో ఆదివారం నుండి లాక్డౌన్ ఎత్తివేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది.
లాక్డౌన్ను ఎత్తివేసి రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు సమాచారం. 50% సీటింగ్ కెపాసిటీతో థియేటర్లకు అనుమతి ఇవ్వడంతో పాటు పార్కులను సైతం తెరిచే అవకాశం ఉంది. అయితే, అంతర్రాష్ట్ర బస్సులను మాత్రం ఇప్పట్లో అనుమతించే అవకాశాల్లేవని సమాచారం.