టాలీవుడ్లో మరో క్రేజీ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి కాంబినేషన్లో మూవీ రానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల గౌతమ్, రామ్ చరణికి ఒక కథని చెప్పాడట. ఆ కథకి చరణ్ అంతగా ఇంప్రెస్ కాకపోవడంతో, కొన్ని మార్పులు చేసి విజయ్ దేవరకొండకు వినిపించాడట. ఆ కథ విజయ్క బాగా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.