తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోన్‌లో మాట్లాడారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నెల 22న సీఎం గ్రామ సందర్శనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గ్రామ సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ రోజు ఊరంతా కలిసి సామూహిక భోజనం చేద్దామని చెప్పారు.
గ్రామ సభ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిద్దామని పేర్కొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పరిశీలించారు.