తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు గ్రామాల్లో నిద్రచేసి అక్కడికక్కడే పరిష్కరించాలని పంచాయతీరాజ్‌శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు.
పల్లెప్రగతి విజయవంతానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. బుధవారం వరంగల్ నుంచి పల్లెప్రగతిపై అదనపు కలెక్టర్లు, డీపీవోలు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అధికారులు తప్పనిసరిగా నెలలో కొన్నిరోజులు పల్లెల్లో నిద్రచేయాలని, గ్రామంలో పర్యటించి పరిశుభ్రత, గ్రీనరీ ఇతర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.