తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వైరస్ బారినపడిన వారిలో 2,493 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,00,318కి పెరిగాయి.
వీరిలో 5,74,103 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 22,759 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు మొత్తం 3,456 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,24,066 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.